Breaking News

సేవాలాల్ సేన 10వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రమంతటా జరుపుకోవాలి – సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పిలుపు

0 0

ఈరోజు సేవాలాల్ సేన రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సెంట్రల్ కమిటీ ఆదేశానుసారం
ఈనెల 9న (సోమవారం) నాడు జరుగు 10వ ఆవిర్భావ దినోత్సవం ప్రతి జిల్లాలో జెండా ఆవిష్కరణ చేసి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని జిల్లా కమిటీ నాయకులకు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది..

ఆయా జిల్లాల వారీగా సేవాలాల్ సేన మండల,జిల్లా, రాష్ట్ర మరియు అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించాలని తీర్మానం చేయడం జరిగింది..

తీర్మానాలు:

  1. తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేన అన్ని జిల్లాల యందు మండల, జిల్లా,రాష్ట్ర మరియు అనుబంధ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయాలి..
  2. జెండా ఆవిష్కరణ తదుపరి ప్రతి మండల, జిల్లా స్థానిక సమస్యలపై సేవాలాల్ సేన అన్ని కమిటీలు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయాలి..

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మూడవత్ బాలాజీ నాయక్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్, మహిళా సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి వడ్త్య్ రేఖ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధారావత్ డాక్టర్ తారచంద్ నాయక్, దేపావత్ పరశురాం నాయక్, భూక్యా రమేష్ నాయక్, పాత్లవత్ రవి నాయక్, మరియు గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %