మహబూబాబాద్ జిల్లా ది.05-09-2024 రోజున మహబూబాబాద్ నియోజక వర్గంలోని నెల్లికుదురు మండలంలో రావిర్యాల , గ్రామం పర్యటన.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారు, ఇటీవల అకాల వర్షాలు కురిసి ఇంటిలోకి నీరు రావడం, మరియు చెరువు కట్టలు తెగిపోయి ఇక్కడ ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుల పొలాలు పూర్తిగా పంట నాశనం తో నష్టపోయారు.
వీటన్నిటినీ పరిశీలించిన జాటోతు హుస్సేన్ నాయక్ గారు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇళ్లు కూలిన వారికి పక్క ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల లోనికి నీరువచ్చిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఐదు రోజులు ఐన ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం చాలా బాధాకరం అని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
వరద బాధిత కుటుంబాలకు తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులు, 120 కుటుంబాలకు అందించడం జరిగింది.