- రాష్ట్ర రాజధాని హైరాబాదులోని అరణ్య భవన్ లో అటవీ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం IAS గారు, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల DFO కు మరియు గిరిజన అసోసియేషన్ సభ్యులతో లతో గిరిజన సమస్యలపై జాతీయ ST కమిషన్ మెంబర్ శ్రీ|| జాటోతు హుస్సేన్ నాయక్ గారు సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
- 🔹 గతంలో గిరిజన రైతులకు అప్పటి ప్రభుత్వం పోడు భూముల RFRO హక్కు పత్రాలు మంజూరు చేసినప్పటికీ… అనేక ప్రాంతాల్లో చాలామంది రైతులకు హక్కు పత్రాలు మంజూరు కాలేదు…
- 🔹 కష్టపడి సాగు చేసుకున్నటువంటి పోడు భూములను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నంలో సూర్యాపేట జిల్లా గుర్రం పోడు తండా తో పాటు అనేక ప్రాంతాల్లో అమాయక గిరిజన రైతులపై అక్రమ కేసులు నమోదయ్యాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేయాలి…
- 🔹జిల్లాలో RFRO హక్కు పత్రాలు మంజూరు చేసినప్పటికీ రైతులను పంట సాగుకు అనువైన క్లియరెన్స్ ఇవ్వాలని అటవీశాఖ అధికారులకు సూచించడం జరిగింది….
- 🔹 మహబూబాబాద్ జిల్లా లో ఫారెస్ట్,రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలని అన్నారు