0
0
ఈరోజు సేవాలాల్ సేన రాష్ట్ర కార్యాలయము హైదరబాద్ లొ నేను సైతం సేవాలాల్ సేనలో అనే భావజాలంతో…. సేవాలాల్ సేన చేస్తున్న అనేక కార్యక్రమాలకు ఆకర్షితులై, వాటిని దృష్టిలో పెట్టుకొని నేను నా జాతి కోసం పనిచేస్తానని ముందుకు వచ్చిన బంజారా జాతి ఆడపడుచు శ్రీమతి శ్రీ పోరిక అనుబాయి గారికి
రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ గారి ఆధ్వర్యంలో సేవాలాల్ మహిళా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రఘురాం రాథోడ్ గారు, సేవాలాల్ మహిళా సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి గారు, సేవాలాల్ సేన జిల్లా నాయకులు లక్ష్మణ్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు