Breaking News

క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1871 పుట్టుటకు కారణాలు.

0 0

క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1871 పుట్టుటకు కారణాలు.


బంజారాలు ఆత్మాభీ మానం కలవారు వారిస్త్రీలపై కన్ను వేసిన వాడి కన్ను పెరికిన వారు. చెయ్యి వేసిన వారి తల నరికిన వారు బ్రిటీష్ కుక్కలు చేసిన మానభంగాలను వారి పై అధికారుల వద్ద దాచి ప్రతిగా బంజారాలు దొంగలని, భారతీయ రాజులకు వేగులని, బ్రిటీషు రాణి కిరీటానికి వ్యతిరేకించే వారుగా ముద్రించి వారిని మరింత శత్రువులుగా చేసారు.
నాటినుండి బ్రిటీషుదొరలు టాంగా గుర్రపు బగ్గిలో రాగానే బంజారా పురుషుడు వంగి వీపు వారికి మెట్లుగా మార్చి వుండగా దొరలు వారి వీపు పై బుట్లు పాదాలతో ట్రొక్కుకుంటూ దిగేవారు.
దొరగారు ఇంట్లొ దొరసానితో సరసాలాడుచుండగా బక్క చిక్కి బంజారాలు కిటికీ గుండా తాళ్ళతో ఫంఖా( fan) విసిరేవారు. రాత్రి పగలు ఆలా విసురుతూనే వుండాలి.
దొరగారికి దాహం కోసారం నీటి మర చెంబు తొ వారి గుఱ్ఱం బగ్గి వెనకాలే పరగెత్తేవారు.
దొరసానులు కొందరు చిల్లర విసరి బంజారా పిల్లలు ఒకరినొకరు తోసుకుంటూ,ట్రొక్కుకొంటూ,గీరుతూ, గిచ్చుతూ, చిల్లర పైసలు ఎరుకొనే వారు పిల్లలు గోచి పెట్టుకుని చిల్లర ఎరుకుంటుంటే దొరశానులు చూసి ఆనందించేవారు .
దొరసానుల వంట వండడానికి పేద బంజారాలను నియమించుకుని వారికి కావలసిన గొడ్డు మాంసం,వంటలు, పదార్థాలు వడీoచుకొని తినేవారు వారు వండమంటే వాతులు పెట్టేవారు.
వంట పూర్తీ ఐయ్యే వరకు వండిన వంటలు తింటారేమో అని వారి మూతికి మెడకు కలుపుతూ ఇనుప చిక్కాలు వేసి తాళం వేసేవారు.
వారి భవనాలలో దీపాలన్ని శుభ్రంగా తుడిచి నూనె వేసి వెలిగించ డానికి సేవకులుగా వాడుకొనేవారు. సరిగా గాజు చిమ్నీ తుడవకపోతే కొరడాలతో కొట్టేవారు.
వారి రాణులు, దొరశానుల కళ్ళలో చూడకూడదు పక్కగా చూసి పలకరించాలి ఎవరైనా చూస్తే కంట్లో కారం వీసేవారు.
దారుణాతీ దారుణమైన హింసలు అనుభవించేవారు. వారికి మాత్రం సకల సౌకర్యాలు సమకూర్చే వారు. భాదలను దిగమ్రింగేవారు దొరలకు వంగి సలాం చేయాలి కాలి బూట్లు సరిగా శుభ్రం చేయకపోతే నాలుకతో శుభ్రం చెయ్యించే వారు.
ఈ క్రియాలన్ని చూసి కొందరు రక్తం వుడికి తిరగ బడేవారు వారినీ దొంగగా ముద్రించి జైలులో వేసి శిక్షి వేసేవరు. సరియైన తిండి నీరు ఇచ్చే వారు కాదు. దాహానికి వారి ఉచ్చ వారే త్రాగేలా చేసేవారు.
బంజారా స్త్రీలు పురుషులను ఠాణా (police station) తీసుకెళ్ళి నిత్యము వేలిముద్ర వేయించుకొని పంపేవారు అలా కొందరు స్త్రీలను ఠణా ఊడ్చి వేళ్లమని, నీరు తెచ్చి పెట్టమని , నీ భర్త వచ్చే వరకు వుండమని హత్యాచారం చేసేవారు.
కోపం తొ బంజారాలు పరాక్రమంతో బ్రిటిషర్లు హత్య చేసేవారు.
ఎన్నివీదాలుగా శిక్షించిన తగ్గని బoజారాలను” థాగ్స్”గా అభి వర్ణించారు. బ్రిటీష్ వారు పాలించే అన్నీ దేశాలలో వీరిగురించి చెడుగా “Thaggs of India”అనె పుస్తకాన్ని ముద్రించి బంజారాలుక్రిమినల్స్ అని, తిరుగు బాటు దార్లు అని, దొంగలని, అన్ని దేశాలలో విపరీతంగా ప్రచారం చేసారుఅన్నిదేశాలకుఈపుస్తకం పంచబడింది.దొంగల కాబట్టి వారి కోసారం ఒక ప్రత్యేక చట్టం తెస్తున్నామని 1871లో క్రిమినల్ ట్రయిబ్స్యాక్ట్ అంటు చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ద్వారా బాంజారాలను తమకాళ్ళ క్రింద చెప్పులా వుంచుకున్నారు దారుణంగా హింసించారు.
చాలా మంది కుటుoభ సమేతంగా రాత్రలకు రాత్రుళ్లు
పారి పోయేవారు ఎక్కడికి పోయినా అక్కడా వారి ప్రభుత్వమే అక్కడ భందించి హైసించే వారు.
అలీన శిఖరాగ్ర దేశాలన్నీటిలో చెడుగా ముద్రవేశాసు ఏ దేశం వారు భంజారాలను రానిచ్చేవారు కాదు. బంజారాలపై ఎంత క్రోధం వుండేదొ అర్థమవుతుంది.
అది ఈ చట్టం పుట్టడానికి కొంత కారణము.
మన స్వతంత్ర భారత దేశంలో కూడాను బాంజారాలు 1956వరకు ఎన్నో పోరాటా తరువాత మాత్రమే ఆ చట్టం రద్దు చేసారు.
సోదరులారా ప్రతీ హక్కు పోరాటాల మయమే,
ఈ పాలకుల పాలనలో వూరికే ఏది లభించదు మన హక్కు లైనా, చట్టాలైనా, రాజ్యాంగ నియమాలై నావిధులైనా, హక్కలైన,( భాద్యతలు మరువరాదు).సాధించడానికి మనమంతా ఒక్కటై పోరాడదాం. రండి దేనికైనా కలసిరండి.

జై బంజారా, జై మాతా భవానీ, జై సేవా లాల్, జై హాతీ రామ్. జై మిటు భూక్యా. జై గోర్.


S.N. కృష్ణా నాయక్, అనంతపురం జిల్లా

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %