సేవలాల్ సప్త… వివరణ
సేవా లాల్ మహారాజ్ తమ జీవిత పర్యంతం మానవ ధర్మం కోసం ప్రచారం చేసేవారు, పశువులు కాచు సమయమున సేవా లాల్ మహారాజ్ కి ఇద్దరు ప్రియమైన సహచర మిత్రులు ఉండేవారు వారే సక్క,, భిక్క ప్రతిరోజూ సేవా లాల్ మహారాజ్ గారి ప్రవచనములు వింటూ, ఆ బోధనలకు ముగ్ధులు అవుతూ, సేవాళాల్ మహారాజ్ గారి గొప్పతనమును సమాజానికి చాటి చెప్పేవారు. ఇలా సేవా లాల్ మహారాజ్ గారి గురించి నలుదిశలా వ్యాపించింది. ఈ సక్కా, భిక్కా లకు సేవా లాల్ మహారాజ్ అంటే ఎనలేని గౌరవం, భక్తి ఉండేది. సేవా లాల్ మహారాజ్ గారి ప్రవచనములు, సేవా లాల్ మహారాజ్ గారు ఒక మహోన్నత, ఆదర్శ పురుషుడు అని నమ్మేవారు..సేవా లాల్ మహారాజ్ పరమపదించిన తర్వాత, ఆయన జ్ఞాపకార్థం, ఆయన చేసిన బోధనలు,ప్రవచనములు మననం చేసుకుంటూ బంధు మిత్రుల కు తెలియజేస్తూ ఏడు రోజుల పాటు, సప్త, కార్యక్రమం నిర్వహించారు. దీనినే సేవా లాల్ మహారాజ్ సప్త,అని అంటారు..ఈ ఏడు రోజుల పాటు తండా లలో నాయక్ గారి ఇంటినందు, లేదా ఎవరికి వారే తమ ఇంటిలో సేవా లాల్ మహారాజ్ గారి దీక్ష స్వీకరించి, ఏడురోజుల పాటు ధర్మబద్ధంగా ఉంటారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం జల భోగ్, లేదా అంగార్ భోగ్ నిర్వహించాలి, ప్రతి రోజూ సాయంత్రం దీక్షా శిబిరానికి చేరుకొని, సేవా లాల్ మహారాజ్ గారి జీవిత చరిత్ర, బోధనలు ప్రవచనములు, ఆశయాలు, లక్ష్యాలు తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఏడు రోజుల పాటు సప్త కార్యక్రమం లో మిత ఆహారం తీసుకోవాలి, మద్యం, మాంసం చేపలు తినరాదు, అబద్ధం ఆదరాదు, మోసపు పనులు చేయరాదు, సమస్త చరాచర జగత్తును తేజోవంతం కోసం, ధర్మ బద్ధంగా జీవిస్తూ, తల్లి తండ్రి గురువు ల పాదములకు నమస్కరించి తర్వాత దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలి.
విషయ సేకరణ
మీ బాణోత్ భోజ్యాా నాయక్
గోర్ సిక్ వాడి ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు