కాసులకు కక్కుర్తి పడి అమ్ముడుపోయిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిడి
బదిలీలు అయి నెల రోజులు గడుస్తున్నా వెళ్ళని కొంతమంది ఉపాధ్యాయులు, జూనియర్ అసిస్టెంట్లు
గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లల భవిష్యత్తు ఏంటి ?
పట్టించుకోని జిల్లా కలెక్టర్
వారం రోజులలో బదిలీ అయినా ఉపాధ్యాయులు, జూనియర్ అసిస్టెంట్లు వారి స్థానాలకు వెళ్లకుంటే డిడి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
బోడ రమేష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి
జిల్లా అధ్యక్షుడు
మహబూబాబాద్
ఈరోజు జిల్లా కమిటీ సమావేశం అనంతరం మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ లో సాధారణ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ అయి దాదాపుగా నెల రోజులుగా వస్తున్న కూడా కొంతమంది ఉపాధ్యాయులు మరియు జూనియర్ అసిస్టెంట్లు గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అలవాటు పడ్డవారు.
డబ్బు బలంతో తాము దోచుకున్న దాంట్లో కొంత మొత్తంలో డిడికు మూట చెప్పడం వల్ల తమకు బదిలీలైన స్థానం కు వెళ్లడం లేదన్నారు. వారు మరల 10 సంవత్సరాలు ఆశ్రమ పాఠశాలలో చదువుకునే పేద పిల్లల నోరు కొట్టి అక్రమంగా సంపాదించుకోవచ్చని ఆలోచనతో తమకు బదిలీ అయిన స్థానానికి వెళ్లడం లేదు.
ఈ ప్రక్రియలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ డిడి కి తన వాటా తనకు వచ్చినందున ఆయన కూడా బదలీలపై వెళ్ళని ఉద్యోగులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. స్థానచలనం అయిన కొంతమంది ఉపాధ్యాయులు, జూనియర్ అసిస్టెంట్లు బదిలీలపై వెళ్లకపోవడం వల్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సకాలంలో చదువులు అందక వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని అన్నారు.
ఈ విషయంలో గతంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కూడా ఫలితం లేకపోయింది. స్థానచలనం అయిన ఉపాధ్యాయులు మరియు జూనియర్ అసిస్టెంట్లు బదలీలపై వెళ్లకపోవడంలో అసలు ఆంతర్యం ఏముంది అని ప్రశ్నించారు. వారం రోజుల లోపల స్థానచలనం అయిన ఉపాధ్యాయులు మరియు జూనియర్ అసిస్టెంట్లు వారికి బదిలీ అయిన ప్రదేశాలకు వెళ్లకపోతే జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వందల మందితోని ముట్టడి చేస్తామని మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, జిల్లా కార్యదర్శి జాటోతు వెంకన్న నాయక్, టౌన్ అధ్యక్షులు హాతిరామ్ నాయక్, జిల్లా యువజన అధ్యక్షుడు ధరావత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు