దశాబ్ద కాలంలో BDRS సాధించిన విజయాలు. BDRS ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగిన గూగుల్ మీటింగు లో 10 సంవత్సరాల నుండి చేస్తున్న కార్యక్రమాలు సమీక్ష చేయడం జరిగింది.
- BDRS చరిత్ర
- BDRS – బంజారా ధర్మ రక్షా సమితి 2014 సెప్టెంబర్ 13, 14 తేదీలలో జాతీయ సదస్సు సందర్భంగా గుజరాత్ రాష్ట్రములోని సూరత్ లొ ఆవిర్భవించి 2024 సెప్టెంబర్ 14 నాటికి పది సంవత్సరములు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా BDRS చేసిన కార్యక్రమాలు.
- సెప్టెంబర్ 14 నాటికి పది సంవత్సరములు పూర్తి చేసుకున్న బి డి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైనవి
- రాష్ట్రంలో దాదాపు 150 కుటుంబాలు మతం మారిన వారిని తిరిగి స్వధర్మం లోకి ఘర్ వాపసి చేశాము
- ప్రతివారం లేదా పౌర్ణమి/ అమావాస్య రోజులలో కచ్చితంగా భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించాలి అనీ విస్తృత ప్రచారం చేయడం జరిగింది అదే విధంగా అనేక తండాల్లో భగ్ నీర్వహించాము.
- ప్రతి తాండాలో గుడి నిర్మాణాలు జరగాలి, SSF మరియు టీటీడీ ఆధ్వర్యంలో గుడి నిర్మాణాలు చేపట్టండి అని పిలుపునివ్వడం జరిగింది, గుడి ఉన్న ప్రతి చోటా పూజారి నియామకం కచ్చితంగా ఉండాలి అని చెప్పి చైతన్య పరచడం జరిగింది .
- బంజారా గుడి పూజారులకు ప్రత్యేక భోగ్ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది.
- గుడి పూజారుల కోసం జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.
- 2019లో కరోనా సమయంలో
ప్రతి గుడి పూజారికి ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లు చేయడం జరిగింది. - మరియు ఆంధ్రప్రదేశ్ లో తీజ్ ఉత్సవాలు లను ప్రోత్సహించి/ ప్రథమంగా ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ అనేక చోట్ల జరుపుతూ ఉన్నాము
- ఇతర రాష్ట్రాల నుండి అనేకమంది సాధుసంతులను ఆంధ్రప్రదేశ్ లొ పిలిపించి పర్యటన చేయించాము.
- హాథిరాంఘడ్ విశ్వ వ్యాప్తం గా ప్రచారం చేయడం జరిగింది.
- ప్రతి సంవత్సరం దీపావళికి ముందు జరిగే హాథిరాం బాబాజీ బర్శి ఉత్సవాలు ఘనంగా జరుపుటకు మఠం వారికి చెప్పి బంజారాలు అనేకమంది బర్శి ఉత్సవాల్లో పాల్గొనే విధంగా చేయడం జరిగింది
- తిరుమల తిరుపతిలోని హతిరం గడ్ లో నిరంతర భోగ్ పూజా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది, ప్రతి ఆదివారం భోగ్ నిర్వహించాము అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు అమావాస్యనాడు భోగ్ నిర్వహించడమే కాకుండా తిరుమలలో వారానికి రెండు మూడు సార్లు ఉదయం పూట హతిరామ్ మఠంలో కార్యక్రమం జరపడం జరిగింది.
- హాథిరాంఘడ్ నుండి సేవాగడ్ కు హాథిరాం బావాజీ పగిడి యాత్ర అనే కార్యక్రమం చేపట్టి సేవాలాల్ జయంతి సందర్భంగా సేవాలాల్ మహారాజ్ వారికి హాథిరాం పాగడి సమర్పించడం జరిగింది
- ప్రతి సంవత్సరం సేవాగడ్ నుండి హాతిరాంఘడ్ కు సేవాలాల్ జ్యోతి తీసుకెళ్లడం జరిగింది .
- ఈ సందర్భంగా ప్రతి తండాలో జ్యోతి దర్శనం చేయించాము. సేవాలాల్ జ్యోతి తో పాటు కాలో కుండ్ లోని పవిత్ర జలం మరియు ఒక ఝారి తీసుకెల్లాము.
- హతిరామ్ మటానికి తీసుకెళ్లి అక్కడ ఆ పవిత్ర జలంతో హాథిరాం వారి పటము బాలాజీ వారి పటము కడిగి ఆ జ్యోతితో భోగ్ నిర్వహించే వాళ్ళం.
- మహారాష్ట్ర లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ జాగరణ మరియు SSF వారి సహకారంతో బిఎస్ఎస్ బంజారా సమన్వయ సమితి ఏర్పాటు చేసి రాష్ట్రమంతా అన్నితాండాలలో పర్యటించి ప్రచారం చేసి చలో గోద్రి కుంభమేళా నినాదం ఇచ్చాము. అనేకులు పాల్గొన్నారు
- ఆంధ్రప్రదేశ్ లొ దాదాపు 550 తాండాలకు సేవాలాల్ మహారాజ్ వారి పటము ఇవ్వడం జరిగింది.
- సేవాగడ్ లో జరుగు ప్రతి ఏడు సంవత్సరములకు ఒకసారి సేవాఘడ్ పుష్కరాలకు విస్తృత ప్రచారం చేయడం జరిగింది
- హాథిరాంఘడ్ లో హాథిరాం బావాజీ బాలాజీ లకు భోగ్ సమర్పించి ప్రతి దీపావళికి ముందు హాతీరామ్ బర్సి సందర్భంగా పితృదేవతలకు ఊద్ సమర్పించడం జరిగింది.
- హాథిరాం మఠంలో సాధు సమావేశంలో హాతీరామ్ బావాజీ వారసులుగా సంత్ శ్రీ శ్రీ రమేష్ గిరి మహారాజ్ వారికి శ్రీ శ్రీ గణేష్ మహారాజ్ వారికి మహంతు గా ప్రకటించడం జరిగింది 18. ఆల్ ఇండియా బంజారా ధర్మ రచన సంగ్ వారికి సహకారంగా BDRS పనిచేస్తూ వస్తున్నది
- తెలంగాణా లొ 2015లో జరిగిన ప్రథమ బంజారా సాధు సమ్మేళనానికి బీడీఆర్ఎస్ విస్త్రుత ప్రచారం చేసింది గుడి పూజారులకు జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.
- 2024 ఆంధ్రప్రదేశ్ లొ జరిగిన తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవాగడ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీజ్ బుట్టలు పెట్టీ, సేవాఘడ్ తీసుకెళ్లి కాలో కుండ్ ప్రప్రధమంగా నిమజ్జన కార్యక్రమం చేయడం జరిగింది
- ప్ర ప్రథమంగా హతిరాంగడ్ లొ శ్రీహతి రాం బాబాజీ జయంతి ఉత్సవాలు జరిపి, తర్వాత మిగతా సంఘాల ఆధ్వర్యంలో జరుపుతూ వచ్చాము మరియు విస్తృత ప్రచారం చేశాము
- ప్రప్రథమంగా బావాజీ మాలాధారణ చేయించి హతీరాంబవాజీ బర్సీ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది
- రాష్ట్రంలో అమర్ గడ్ స్థాపన అవశ్యకతను గ్రహించిన బిడిఆర్ఎస్ అమరగడ్ లో బంజారా గుడి పూజారులు సమావేశం నిర్వహించడం జరిగింది.
- సంత్ శ్రీ రామరావు మహారాజ్ ఇచ్చిన జెండాలు అమరగడ్ లో ఆవిష్కరణ చేయడం జరిగింది
- రాష్ట్రంలో పది చోట్ల ప్రాంతీయ
సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. - నాలుగు రకాల క్యాలెండర్లు ప్రచురించడం జరిగింది.
- 360 కరపత్రాలు ఆవిష్కరణ, 2 రకాల బంజారా పుస్తకాలు విడుదల చేయడం జరిగింది ఆవిష్కరణ చేయడం జరిగింది
- బంజారా ఏకశిల, పెద దేవాలపురంలో జరిగిన గుడి పూజారుల సాధువు సమ్మేళనం విజయవంతమైంది
- గుంతకందల తండాలో హోలీ ఉత్సవాలు జరిపించాము.
- హోలీ పరిరక్షణా సమితి ఏర్పాటు చేసి హోలీ మాతకు అబాసు పాలు చేస్తున్న మహిళలను అడ్డుకోవడం జరిగింది.
- ఆత్మకూరు ట్రైబల్ డివిజన్ ఏర్పాటులో చేయుటలో బిడిఆర్ఎస్ సహకరించింది
- తీజ్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి రాష్ట్రంలో తీజ్ ఉత్సవాలు జరుపుటకు ప్రోత్సహించింది.
- దాదాపు 400 కు పైగా గూగుల్ మీటింగు/ జూమ్ మిటింగుల నిర్వహణ
- రాధాగడ్ కోసం మూడు చోట్ల జెండా ఆవిష్కరణ
- ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో సేవాలాల్ జయంతి వేడుకలు
- ప్రతి సంవత్సరం డిసెంబర్ లో సేవాలాల్ సప్తా నిర్వహించాము
- విశ్వ బంజారా దివస్ సందర్భంగా జూమ్ మీటింగులు
- రిజర్వేషన్ సాధించిన వడితే గోపాల్ రావు నాయక్ వర్థంతి జూమ్ మీటింగులు
- పద్మశ్రీ రాంసింగ్ బనావత్ జీ గూగుల్ మీటింగులు
- గుడి పూజారుల హక్కుల కోసం వినతి పత్రాలు ఇవ్వడం
- యాడి భారతి పూజోత్సవం జరిపాము.
- తండా రాజ్యం లో మత మార్పిడిని / మత ప్రచారం ను అడ్డుకోవడం జరిగింది.
- హతిరాం బావాజీ మటం పరి రక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఎర్పాటు చెయ్యాలని డిమాండు చేశాము
భవిష్యత్ కార్యాచరణ
తండా రాజ్యం లో ఎలాంటి మత ప్రచారం లేకుండా చేసి మతం మారిన వారిని తిరిగి స్వధర్మం లోకి తేవడం
ప్రతి తండాల్లో నిరంతర భోగ్ పూజా పద్ధతి ప్రచారం చేసి, ప్రతి వారం లేదా ప్రతి పౌర్ణమి/ అమావాస్య రోజులలో భోగ్ పూజ ను జరుపునట్లు చేయడం
ప్రతి గుడి పూజారికి జీతభత్యాలు సాధించడం
గుడి పూజారులకు నిరంతర భోగ్ పూజా శిక్షణా తరగతులు నిర్వహించడం
బంజారా ధర్మ రచన కు సహకారం అందించడం
2028 సేవాఘడ్ లో పుష్కరాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ పవిత్ర స్నానాలు చేసేలా చేయడం
2028 లో బంజారా కుంభ మేళా సేవాగడ్ లో నిర్వహించేలా సేవాగడ్ ట్రస్టు వారికీ విన్నపాలు
2028 అఖిల భారతీయ సాధు సమ్మేళనం నిర్వహించడం.
బంజారా ధర్మ పునః స్థాపన, బంజారా ధర్మ శాస్త్రం ఆవిష్కరణ కోసం నిరంతర కృషి చేయడం.
హాతీరామ్ బావాజీ ప్రత్యేక బోర్డు ఎర్పాటు చెయ్యాలని పోరాడి సాధించడం.
తీజ్ ఉత్సవాలు అన్ని ప్రాంతాలలో జరుగునట్లు ప్రచారం చెయ్యడం
గోర్ సంప్రదాయ పద్ధతిలో వివాహాలు జరిపించడం
గోర్ బోలి నీ రాజ్యాంగం 8th షెడ్యూల్ లో చేర్చుటకు ప్రయత్నం చేయడం
ప్రతి తండాల్లో సేవాలాల్ జయంతి వేడుకలు జరపడం
హోలీ, తీజ్ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం గుర్తించేలా కృషి చేయడం
2024 డిసెంబర్ నాటికి చేయవల్సిన కార్యక్రమాలు
- త్వరలో BDRS ప్రాంతీయ సదస్సు
- గుడి పూజారులకు జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్
- సేవాలాల్ సందేశ్ యాత్ర -3 ప్రారంభం
- అక్టోబరు చివరి వారంలో సేవాలాల్ జ్యోతి యాత్రా ( 27 నుండి 31 వరకు) సేవాగడ్ నుండి హతిరామ్ ఘడ్ వరకు)
- డిసెంబరు 19 నుండి 25 వరకు సేవాలాల్ సప్తా జరపడం
జై సేవాలాల్, జై హతిరామ్… జై BDRS
……………………………………………………………………………………
బంజారా ధర్మ రక్షా సమితి – BDRS ఆంధ్ర ప్రదేశ్