గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్రుష్టికి ఏజెన్సీ, గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మేరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందేలా చూడాలని, మరియు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల కనీస వేతన G.O వంటి పలు విషయాలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన “తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకులు, “లంబాడీల (బంజారా) ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు” డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు.
@@@@@@@
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ, రేవేన్యూ, జిహెచ్ఎంసి, పంచాయతీరాజ్, సింగరేణి వంటి పలు శాఖలలో నియామకాలు చేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా పనులు చేయించుకుంటూ శ్రమ దోపిడీకి గురి అవుతున్న కార్మికులు అత్యధిక శాతం నిరుపేద గిరిజన దలిత బడుగు బలహీన కుటుంబాలే ఉన్నారని కోన్ని శాఖలలో 6 నెలలు గడుస్తున్న జీతాలు అందని దుస్థితి ఉందని, మరియు మన తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతన G.O గత పది హెను సంవత్సరాల నుండి సవరణ జరగలేదు అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ గారు తీసుకువెళ్లడం జరిగింది