లాతూర్ పట్టణ కేంద్రంలో సకల్ బంజారా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న దేవి భక్త శేఖర్ మహరాజ్ గారు…!!
మహారాష్ట్రలోని లాతూర్ పట్టణ కేంద్రంలో సకల్ బంజారా మోర్చా ఆధ్వర్యంలో తేదీ :23/09/2024 సోమవారం రోజున జరిగిన మహాధర్నా లో మహారాష్ట్రలోని బంజారాలకు ST జాబితాలో కలపాలని మహారాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సకల్ బంజారా మోర్చా కమిటీ అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి బంజారా కాశీ పౌరాదెవీ నుండి శ్రీ ధర్మ గురు దేవి భక్త శేఖర్ మహారాజ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మహారాజ్ గారు మాట్లాడుతూ భారతదేశనికి స్వాతంత్రం తీసుకురావడం కోసం బ్రిటిష్ వాళ్లతో యుద్ధానికి భాగస్వాములై బంజారా మహా వ్యక్తులు ప్రాణ త్యాగం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా భారతదేశంలోని బంజారా జాతికి ST జాబితాలో చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బంజారా సోదరులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు…✊✊✊