
బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే
త్వరలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తామంటూన్న గిరిజన సంఘాల ప్రతినిధులు
రాష్ట్రవ్యాప్తంగా 20 గిరిజన సంఘాలు త్వరలో కార్యచరణ ప్రకటిస్తామని తెలపడం జరుగుతుంది
ది 04-10-2024 రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో లంబాడీలు కీలక పాత్ర పోషించారని, ఈ మాటను ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభలలో కూడా చెప్పడం జరిగింది,కావున కాంగ్రెస్ అధిష్టానం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విస్తరించే క్యాబినెట్ లో బంజారా (లంబాడీ)లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ కమిషన్ ను వేరుచేసి ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని, తండా,గూడెం గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, అలాగే బంజారా భాష “గోర్ బోలి”ను 8వ షెడ్యూల్ లో చేర్చాలని కోరడం జరిగింది, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, మైదాన ప్రాంత ఐటీడీఏ చేయాలని కోరారు.గిరిజన హక్కుల సాధనకై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్,గిరిజన శక్తి జాతీయ అధ్యక్షులు డా.వెంకటేష్ చౌహాన్,రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్,గిరిజన జేఏసీ రాజేష్ నాయక్,తెగ అధ్యక్షులు రామచందర్ నాయక్,సురేష్ నాయక్,lhps రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్,తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షులు శ్రీరాం నాయక్,తెలంగాణ గిరిజన సమాఖ్య అధ్యక్షులు అంజయ్య నాయక్,tif ధనుంజయ్ నాయక్,ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ హరి కిషన్,lhps ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్,TSTTF రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షులు సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ నారాయణ నాయక్,గిరిజన శక్తి నాయకులు రమేష్ రాథోడ్,విజయ్,శివ,హన్మంతు,నందు నాయక్,పృథ్వి నాయక్,హరి నాయక్,గిరిజన సంఘాల ప్రతీనిధులు పాల్గొనడం జరిగింది.