Breaking News

గిరిజన భూములను ఆక్రమించిన కంపెనీ యాజమాన్యాలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి – రమావత్ శ్రీరాం నాయక్

4 1

కంపెనీలు ఆక్రమించిన భూములను తిరిగి గిరిజనులకే ఇవ్వాలి

-రమావత్ శ్రీరాం నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేశారు

రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, కొండకల్ తండాలో శనివారం బాధిత గిరిజనులు, పేదల కుటుంబాలతో జరిగిన సభ జరిగింది. అనంతరం రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆక్రమించిన భూముల్లో విస్తృతంగా పర్యటించి గిరిజనులు, పేదలకు ధైర్యాన్ని ఇచ్చారు. ముఖ్య అతిథులుగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ తో పాటు సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, సీఐటీయూ జల్లా అధ్యక్షులు నేనావత్ రాజు,జగదీష్,గిరిజన సంఘం జిల్లా నాయకులు ఈశ్వర్ నాయక్, స్థానిక గిరిజన నాయకులు శంకర్ నాయక్, సురేష్ నాయక్, రాథోడ్ రవి తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ 1973 నుండి గిరిజనులు సాగుచేస్తున్న అసైండ్ భూములను అపర్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీ వీ కే కంపెనీలు దౌర్జన్యంగా అక్రమించారని ఆరోపించారు. వీరికి అధికారులు, పార్టీ నాయకులతో పాటు పోలీస్ అధికారులు సైతం కంపెనీ యాజమాన్యాలకు వంత పాడుతూ గిరిజనులపై అక్రమ కేసులు, రౌడీషీటర్లు ఓపెన్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

గిరిజనుల భూముల ఆక్రమించిన కంపెనీ యజమానులారా గిరిజనుల జోలికొస్తే ఖబ్ర్దారని హెచ్చరించారు.ఆక్రమణకు గురైన భూములను తిరిగి గిరిజనులకు అప్పగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.అపర్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్,జి వీ కే కంపెనీల యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న భూస్వాములు కోమ్మ విక్రంరెడ్డి, శ్రీరాంరెడ్డి, లచ్చిరెడ్డి ఎస్.ఎస్. రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి వారి గుండాలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ కొండకల్ తండాలో సర్వే నెంబర్ 363,369,377 లలో 95 ఎకరాలు, మరో సర్వే నెంబర్ 392లో 217 ఎకరాల్లో అసైన్డ్ భూములు, బిలా దాఖల భూములు, గుడి మాన్యం వంటి ప్రభుత్వ భూములను అపర్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీ వీ కే కంపెనీలు ఆక్రమిచాయని అన్నారు. గత 55 సంవత్సరాలుగా భూములను సాగుచేస్తూ జీవిస్తున్న గిరిజనులకు తెలియకుండా అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకొన్నారని ఆరోపించారు. గిరిజనులు వేసుకున్న పంటపొరాలను నాశనం చేస్తూ భూముల్లో గోడలు నిర్మిస్తూ, 100 అడుగుల రోడ్లు వేస్తూ ఫ్లాట్లుగా చేసి అమ్ముకునేందుకు సిద్ధపడ్డారని ఆరోపించారు.

తండా ప్రజల సాగుకు వనరులుగా ఉన్న మాసబ్ కుంట, వల్లబస్వామి కుంటలకు నీరు చేరకుండా ఆటంకపరుస్తూ గిరిజనుల జీవించే హక్కును హరించడమేనని అన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారి గోడను కూల్చకపోతే గిరిజనులతో కలసి మేమే కూలుస్తామని హెచ్చరించారు.

అభినందనములతో….

ఆర్ శ్రీరాం నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %