- 🔥రుణమాఫీ కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా రాజకీయనాటకం, పచ్చిబూటకం🔥
🔥 కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 2లక్షల రుణమాఫీ , ఝాన్సీయశశ్వని రెడ్ది గార్లకు విస్పోటనంలా వస్తున్న ప్రజాదారణను ఓర్వలేకనే హరీష్ రావు, ఎర్రబెల్లి విమర్శలు🔥
🔥పాలకుర్తిలో రైతు ధర్నా పేరుతో, రాజకీయ మనుగడ కోసం పాకులాడుతున్న పర్వతగిరి పెద్దమనిషి పై మండిపడ్డ: 🔥 డా. నరేందర్ పవార్- రాష్ట్ర అధ్యక్షులు, ఝాన్సీయశస్వినిరెడ్ది యువసైన్యం, టీపీసీసీ యువనాయకులు & ఓయూ జేఏసీ అధికారప్రతినిధి.🔥కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ నరేందర్ పవార్ గారు మాట్లాడుతూ(06.10.2024) పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురం క్రాస్ రోడ్డువద్ద (04.10.2024న ), మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు *రైతు ధర్నా* పేరుతో దీక్షలు చేయటం మిలీనియం జోక్ అని, ఝాన్సీ-యశస్విని రెడ్ది గార్ల ఒక్క దెబ్బతో ఓటమిరుచి చూసిన *పర్వతగిరి పెద్దమనిషికి* మతిభ్రమించి చిత్ర -విచిత్రంగా మాట్లాడుతున్నాడని, పాలకుర్తి లో సోదిపురాణాలు, సొళ్ళుకబుర్లకు తెరలేపుతున్నాడని దయ్యుపట్టారు. ఈ పర్వతగిరి పెద్దమనిషి టక్కు - టమారా విద్యలకు పాలకుర్తిలో కాలం చెల్లిందని ఇకనైనా తన ఊసరవెల్లి చేష్టలు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.
🔥ఎర్రబెల్లి, హరీష్ గార్లకు , బిఆర్ఎస్ పార్టీకి నిజంగా రైతులపైప్రేమ ఉంటే, రైతుల బాగు కోసమే మొన్న మీరు ధర్నా చేసిఉంటే సూటిగా ఈ ప్రశ్నలకి సమాదానాలివ్వండి. లేదంటే మా రాజకీయ లబ్ధికోసమే ధర్నా చేశామని రైతులకి క్షమాపణలు కోరండి, అని ఛాలెంజ్ చేశారు.
👉రైతు పొలాల్లోకి సాగునీరునిచ్చే చెన్నూర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే గా, మంత్రిగా ఉన్న 15 సం. లుగా ఎందుకు మీరు పూర్తి చేయలేదు.?
👉రైతులకోసమే కటిస్తున్నాం అన్న పాలకుర్తి రిజర్వాయర్ 15 సం.లుగా మీ హయాంలో పడావ్ పడ్డది కదా అప్పుడు రైతులు ఎందుకు మీకు గుర్తు రాలేదు??
👉ఎర్రబెల్లి గారు మీ ప్రభుత్వం హయాంలో క్వింటలకు 4-7 కిలోలు వడ్లు కట్ చేస్తున్నారని పాలకుర్తి రైతులు నాడు మీ ఇలాఖలో ధర్నాలు చేసిన్రు కదా? అప్పడేటుపోయింది మీ ప్రేమ రైతులపై?
👉మీ నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో కల్లాల్లోనే వడ్లు ముద్దలు ముద్దలుగా తడిస్తే..నాడు పాలకుర్తి మహిళా రైతు ఏడ్చుకుంటూ మిమ్మల్ని తొలివెలుగు న్యూస్ ఛానెల్ వేదికగా ప్రశ్నిస్తే? నాడు ఎందుకు ఇదేరైతులపట్ల ఒక్కమాట స్పందించలేదు???
👉🏻గతంలో ఇదే బిఆర్ఎస్ పార్టీని , హరీష్ రావు, కేసీర్, కేటీఆర్ లను రైతుల 2వదఫా రుణమాఫీ, గిట్టుబాటు ధర, రైతుల ఆత్మహత్యలపై తూర్పరా పట్టిన దయాకర్ రావు…. ఇప్పడు అదే బిఆర్ఎస్ పార్టీ, అదే కేసీర్, హరీశ్ రావు , అదే కెటిఆర్ లతో కలసి రైతుల గురించి ధర్నాలు చేస్తే మిమ్మల్ని ఎర్రబెల్లి అనాలా ? ఊసరవెల్లి అనాలా? అది నాలుకనా తాటిమట్టా?? పైనుండి మిమ్మల్ని, మీ పార్టీని రైతులు ఏ మొహం పెట్టుకుని నమ్మాలి ?????
👉🏻 హరీష్ రావు గారు మీ ప్రభుత్వం ధరణి పేరుతో పేద రైతుల భూముల్ని, పెద్ద రైతుల పేర్ల మీద పట్టాలు చేసినప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? దొడ్డు వడ్లు వద్దన్న మీరు నేడు అదే వడ్లకు బోనస్ ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? రైతు బందు పేద రైతులకు కాకుండా మల్లారెడ్డి లాంటి ఎందరో భూబకాసురులకు మీరు అప్పనంగా పంచి పెట్టలేదా??
👉🏻హరీష్ రావు గారు మీరు నాయకత్వం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు, అక్కడి రైతులకు పోలీసు లాఠీలతో కొట్టించి ఎటువంటి న్యాయం చేశారో చెప్పగలరా??
👉🏻ఎర్రబెల్లి, పోచారం శ్రీనివాస్ రెడ్ది, మధుసూదన చారి గార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడుభూములకు పట్టాలు అడిగితే గిరిజన ఆదివాసి రైతులను మీ ప్రభుత్వం చెట్లకు కట్టేసి కొట్టినప్పుడు మీరు ప్రేక్షక పాత్ర ఎందుకు వహించాలో చెప్పగలరా???
👉🏻మహబూబ్ బాద్ జిల్లా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత గార్లు మీ జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న తండాలోని గిరిజన లంబాడి మహిళా రైతుల భూములు లాక్కున్న మీ ప్రభుత్వంలోని నాయకుడు, వాళ్లని కనీసం మహిళా రైతులని కూడా చూడకుండా పోలీసులు చేత కొట్టించి, అర్ధరాత్రి వరంగల్ కేంద్ర కారాగారం లోకి పంపిస్తే మీరు ఏనాడైనా మాట్లాడారా??? ఇప్పుడు ఎక్కడి నుంచి పొడుసుకొచ్చింది రైతులపై మీ కపట ప్రేమ????
👉🏻 పాలకుర్తి కి వచ్చి రైతుల గురించి కపటప్రేమ కురిపించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్న జిల్లాలో మీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు చేసిన రైతుల భూములకు కబ్జాలపై మీరు ఏనాడైనా మాట్లాడినరా? ఘట్కేసర్ లోని మీ అనురాగ్ యూనివర్సిటీ కోసం రైతుల భూములు కబ్జా చేసుకుని కాలేజీలు కట్టుకున్న మీరు ఈ రోజు రైతుల పట్ల ప్రేమను వలకబోస్తున్నారా సమాధానాలు చెప్పండి?
👉🏻 మీ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు ఏపించింది వాస్తవం కాదా? సిరిసిల్లలో నేరెళ్ల రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసుల చేత కొట్టించింది నిజం కాదా??
ముందు పై ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పండి,? తర్వాత రైతులే తేలుస్తారు? అసలు రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదా! తమ సొంత ఖర్చులతో రైతులకు సేవచేస్తున్న ఝాన్సీయశస్వినిరెడ్డి గార్లదా? లేదా రైతు ఆత్మహత్యలపై రాష్ట్రాన్ని 2వ స్థానంలో బజార్లో నిలబెట్టిన బిఆర్ఎస్ పార్టీ దా, కల్లిబొల్లి మాటల కేసీర్ దా ?? ఖబడ్దార్ ఎర్రబెల్లి దయాకర్ అండ్ కో ఇకనైనా మీ స్వార్థ రాజకీయాల కోసం రైతులను మోసంచేయకండి.