Breaking News

శ్రీవెంకటేశ్వరయూనివర్సిటీఅసోసియేట్ప్రొఫెసర్అనుమానాస్పదమృతి.

0 0

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి.. సొంత కారులో మృతదేహం లభ్యం

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. తన సొంత కారులోనే పడుకొని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన రెండు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా ఉండగా, స్థానికులు కారులోని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రియా హాస్పిటల్‌కు తరలించారు. మృతి కారణాలపై స్పష్టత రావాల్సి ఉండగా, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు సర్దార్ నాయక్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, తండ ధర్మారంగా గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనుమానాస్పద మృతి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.✍️ సేకరణ కాజిపేట కృష్ణ ప్రసాద్ ecil హైదరాబాద్ 🌺🙏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %