Breaking News

లంబాడి ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం – డిమాండ్స్

0 0

29/09/2024 – ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం పట్టణం లో ని PR ఫంక్షన్ హాల్ లో జరిగిన లంబాడీల ప్రజా సంఘాల ఐక్యవేదిక JAC ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలకు భద్రాద్రి జిల్లాలో నామినేటెడ్ పదవులు కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి

కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ (ఏఎంసీ) చైర్మన్ పదవిని లంబాడీలకు కేటాయించాలి

గిరిజన గ్రామ పంచాయతీలను కలుపుకొని భద్రాద్రి జిల్లా కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చర్యను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి

ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి 100% రిజర్వేషన్లు గిరిజనులకు కల్పిం చి గిరిజన చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలి

లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలి

లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలో లంబాడీలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమానికి సిద్ధమవుతారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు రాజేష్ నాయక్, న్యాయవాది-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, ఏజెన్సీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బానోత్ లాల్ సింగ్ నాయక్ ,సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, సేవవాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివా నాయక్, సేవలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు లౌడియా ప్రసాద్ నాయక్, LHPS జిల్లా అధ్యక్షుడు కేశవ్ నాయక్, జుంకీలాల్ నాయక్,లాలు నాయక్, TTF సహా అధ్యక్షులు రాములు నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ చౌహాన్,TTF రాష్ట్ర నాయకులు రత్నాకర్, సేవలాల్ సేనా కాన్సిరాం నాయక్, క్రాంతి నాయక్,లంబాడి విద్యార్థి సేద రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ నాయక్,LHPS నాయకులు పంతులు నాయక్,మోహన్ నాయక్, కుష నాయక్,నాగేశ్వరరావు, నాగేందర్, సేవలాల్ సేన నాయకులు హర్యా నాయక్ లచ్చు, హుస్సేన్, సీతారాం, హతి రామ్ ,నెహ్రూ నాయక్, రాజా నాయక్, భద్రంగి, శ్రీను,వెంకటేష్,నాగరాజు రవి తదితరులు పాల్గొన్నారు

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %