Breaking News

రామావత్ శ్రీరామ్ నాయక్ – తండా భూములను లాక్కోవాలని చూడడం అన్యాయo

0 0

Date 29.09.2024:
జిల్లా కేంద్రం – మహబూబాబాద్:

గత ప్రభుత్వం బాబు నాయక్ తండాకు చెందిన భూములను అక్రమంగా లాక్కున్న విధంగానే మళ్ళీ ఈ ప్రభుత్వం తండాకు చెందిన రైతుల భూములను లాక్కోవాలని చూడడం అన్యాయo

తక్షణమే మహబూబాద్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇట్టి విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలబడాలి

లేనిచో గిరిజన జిల్లాలో గిరిజన ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మారిపోతరని గిరిజన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ శ్రీరామ్ నాయక్ అన్నారు .

ఈరోజు జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గత పాలకులకు, మరియు ఈ పాలకులకు పరిపాటగా మిగిలిందని గిరిజన భూములను లాక్కుంటే గత పాలకులు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు తరతరాలుగా మహబూబాబాద్ శివారులోని 551 లో పట్టాలు ఉండి గిరిజనులు తమకు పట్టాలు కలిగి ఉన్న భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని అట్టి భూములను ఎటువంటి నోటీసులు ఏమీ లేకుండా వారికున్న అరకొర సాగు భూములను దొంగ చాటుగా అప్పటి కలెక్టర్ శశాంక మరియు అప్పటి ఎస్పీలు ఇద్దరు కలిసి గిరిజనుల భూమిని అక్రమంగా హోంగార్డ్స్ నివాసస్థలాల కోసం కేటాయించారని జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ చట్టాన్ని హక్కుల్ని కాలరాస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని గిరిజనుల భూములను అక్రమంగా లాక్కుంటాన్న అధికారులపై మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

గిరిజన జిల్లాలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని గత పాలకుల నిర్వాకం వల్ల ఈ జిల్లాలో వందల ఎకరాల భూములు ప్రభుత్వ కార్యాలయాల పేరుతో గిరిజనులు పోగొట్టుకున్నారని అట్టి రైతులకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా గిరిజనులను అన్యాయం చేశారని అదే అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం మరొకసారి గిరిజన భూమి లాక్కొని ఆ ప్రభుత్వం చేసిన తప్పులనే మరొక చేద్దామని చూస్తున్నారని ఇటువంటి తప్పుడు పనులు కనుక చేస్తే గత పాలకుల పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు.

జిల్లాలో గిరిజన ఎమ్మెల్యే ఎంపీలు తక్షణమే జోక్యం చేసుకొని గిరిజనకు గిరిజనులకు రక్షణగా ఉండాలని గిరిజనభూమి గిరిజనులకు చెందిన విధంగా తక్షణమే జోక్యం చేసుకొని గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆయన సూచించారు.

రాబోయే నాలుగైదు రోజుల్లో గిరిజనుల భూమి గిరిజనులకు చెందిన విధంగా చేయాలని లేనిచో పెద్ద ఎత్తున అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ రాష్ట్ర నాయకులు
భానోత్ వెంకన్న నాయక్ భూక్యా హరినాయక్, హేమ నాయక్ సీతరం నాయక్ తదితరులు పాల్గొన్నారు

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %